బట్టలపై టీ మరకలు పడ్డాయా? అయితే వాటిని తొలగించడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
life Mar 20 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
ఇంట్లో ఉండే వాటితోనే మరకలను సులభంగా పోగొట్టొచ్చు
బట్టలపై టీ మరకలు పడితే, వాటిని తొలగించడం చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ మరకలను సులభంగా వదిలించుకోవచ్చు.
Image credits: Getty
Telugu
లిక్విడ్ డిటర్జెంట్‌తో ఇలా చేయండి
ముందుగా బట్టను 20 నిమిషాల పాటు చల్లటి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత, మరక ఉన్న చోట కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి బాగా రుద్దాలి. చివరగా మంచి నీటితో ఉతికి ఆరబెడితే మరక మాయమవుతుంది.
Image credits: Getty
Telugu
బేకింగ్ సోడాతో అద్భుతం
మరక పడిన చోట బేకింగ్ సోడా చల్లి, రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం బట్టను ఉతికితే సరిపోతుంది. టీ మరకలను తొలగించడానికి ఇది కూడా బాగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
వెనిగర్‌తో మరకలు మాయం
చల్లటి నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల వెనిగర్ వేసి బాగా కలపాలి. ఆ నీటిలో మరక పడిన బట్టను కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఉతికితే మరకలు పోతాయి.
Image credits: Getty
Telugu
వెనిగర్, నిమ్మరసం కాంబినేషన్
రెండు స్పూన్ల వెనిగర్, కొద్దిగా నిమ్మరసం కలిపి ఒక మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని మరక ఉన్న చోట రాసి, 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల మరక సులభంగా పోతుంది.
Image credits: Getty
Telugu
ఉప్పు, వంట సోడా
నీటిలో కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిలో మరక పడిన బట్టను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఉతికితే మరక పూర్తిగా పోతుంది.