Headache: తరచూ వేధించే తలనొప్పి నుంచి ఇలా ఈజీగా రిలీఫ్ అయిపోండి
life Jul 07 2026
Author: Nandini Arava Image Credits:Freepik
Telugu
నీళ్లు బాగా తాగాలి
ఒంట్లో నీటిశాతం తగ్గినా కూడా తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే రోజూ వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి రానే రాదు.
Image credits: Getty
Telugu
కోల్డ్ కంప్రెస్
తలనొప్పి వచ్చినప్పుడు, ఒక క్లాత్ లో ఐస్ ముక్కలు చుట్టి నుదుటిపై కాసేపు ఉంచాలి. లేదా చల్లటి నీటిలో ముంచిన క్లాత్ ను కూడా పెట్టుకోవచ్చు. ఇది తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Image credits: Getty
Telugu
నిద్ర చాలా ముఖ్యం
మంచి నిద్ర కూడా తలనొప్పిని తగ్గించడంలో సాయపడుతుంది. వెలుతురు, శబ్దాలు లేని ప్రశాంతమైన గదిలో నిద్రపోవడానికి ప్రయత్నించండి.
Image credits: Getty
Telugu
హెర్బల్ టీ తాగండి
అల్లం, పుదీనా వంటివి కలిపిన టీలు తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఈ హెర్బల్ టీలు తాగడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Image credits: Getty
Telugu
తల మసాజ్ చేసుకోండి
తల మసాజ్ చేసుకోవడం కూడా తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గించి, ఉపశమనాన్ని ఇస్తుంది.
Image credits: Getty
Telugu
భోజనం మానొద్దు
సరైన సమయానికి భోజనం చేయకపోవడం కూడా తలనొప్పికి దారితీస్తుంది. అందుకే, పూట పూటకు కచ్చితంగా భోజనం చేయాలి.
Image credits: Getty
Telugu
విశ్రాంతి అవసరం
శరీరానికి, మనసుకు మంచి నిద్ర, తగినంత విశ్రాంతి చాలా అవసరం. ఇవి లోపిస్తే తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.