Telugu

కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి చాలు!

Telugu

పుల్లటి మజ్జిగ

కరివేపాకు మొక్క పెరుగుదలకు పుల్లటి మజ్జిగ చాలా మంచిది. కొద్దిగా పుల్లటి మజ్జిగ లేదా పెరుగును నీటిలో బాగా కలిపి మొక్క మొదట్లో పోయాలి.

Image credits: Getty
Telugu

గంజి నీళ్లు

గంజి నీళ్లను పారేయకుండా పక్కనపెట్టి, రెండు మూడు రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత దానికి సమానంగా నీళ్లు కలిపి కరివేపాకు మొక్క మొదట్లో పోయవచ్చు.

Image credits: Getty
Telugu

చిగుళ్లను తుంచడం

కరివేపాకు మొక్క పైకి పొడవుగా పెరిగిపోకుండా, పక్కలకు కొమ్మలు వచ్చి గుబురుగా మారాలంటే.. దాని చిగుళ్లను తరచుగా తుంచుతూ ఉండాలి. 

Image credits: Getty
Telugu

సూర్యరశ్మి

కరివేపాకు మొక్కకు సూర్యరశ్మి బాగా తగలాలి. రోజూ కనీసం 5-6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో మొక్కను నాటడం మంచిది.

Image credits: Getty
Telugu

నీళ్లు ఎక్కువగా వద్దు

మట్టిలో ఎప్పుడూ తేమ ఉండాలి. కానీ నీరు నిలిచిపోకూడదు. నీరు నిలిస్తే వేర్లు కుళ్లిపోతాయి. కాబట్టి పైమట్టి ఆరిన తర్వాతే మళ్లీ నీళ్లు పోయాలి.

Image credits: Getty
Telugu

టీ పొడి, గుడ్డు పెంకులు

వాడిన టీ పొడిని కడిగి ఆరబెట్టాలి. గుడ్డు పెంకులను బాగా పొడి చేయాలి. ఈ రెండింటినీ కరివేపాకు మొక్క మొదట్లో మట్టిలో కలిపితే.. మొక్కకు అవసరమైన నైట్రోజన్, కాల్షియం అందుతాయి.

Image credits: Getty
Telugu

వేప పిండి

నెలకొకసారి కరివేపాకు మొక్క మొదట్లో మట్టిని కొద్దిగా తవ్వి, కాస్త వేప పిండి వేయాలి. ఇది మొక్కను రోగాలు, పురుగుల నుంచి కాపాడుతుంది.

Image credits: Getty

Heavy Gold Necklace: మెడ నిండుగా హెవీ బంగారు నెక్లెస్ డిజైన్లు

Blouse Sleeves Designs: ఇలాంటి బ్లౌజు డిజైన్లు చీరకే అందాన్ని తెస్తాయి

Weight Loss Drink: బాడీలో కొవ్వును ఇట్టే తగ్గించే మ్యాజిక్ డ్రింక్

Stone Earrings: తక్కువ బరువుతో వచ్చే రాళ్ల చెవిపోగులు