Cleaning Hacks: ఐరన్ వస్తువుల తుప్పు, షూష్ మురికి వదలగొట్టే చిట్కా ఇది
life Jul 21 2026
Author: Nandini Arava Image Credits:chatgpt
Telugu
కత్తెర తుప్పు పడితే..
మీ కత్తెర తుప్పు పట్టిందా? అయితే ఒక ఉల్లిపాయను తీసుకుని, అందులోకి కత్తెరను గుచ్చి పైకి, కిందికి కదపండి. ఇలా కొన్నిసార్లు చేస్తే చాలు.. కత్తెర తళతళా మెరిసిపోతుంది.
Image credits: healthfacts Instagram
Telugu
ట్యాప్‌పై మరకల కోసం
ట్యాప్‌పై నీటి మరకలు లేదా తుప్పు పట్టిందా? ఒక నిమ్మకాయను తీసుకుని, మధ్యలో కట్ చేసి, ఫోటోలో చూపినట్లుగా ట్యాప్‌కు తగిలించి బాగా రుద్దండి. కొద్దిసేపటికే మరకలు మాయమవుతాయి.
Image credits: healthfacts Instagram
Telugu
ఐరన్ బాక్స్ మాడిపోతే..
ఐరన్ బాక్స్ మాడిపోయిందా లేదా తుప్పు పట్టిందా? బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను ఐరన్ బాక్స్ అడుగున పెట్టి రుద్దితే చాలు..మెరిసిపోతుంది.
Image credits: healthfacts Instagram
Telugu
షూస్ మెరిసిపోవాలంటే..
మీ తెల్లటి షూస్ మురికిగా మారాయా? బేకింగ్ సోడా, ఏదైనా టూత్‌పేస్ట్ కలిపి షూస్‌పై రుద్దండి. ఇలా చేస్తే దుమ్ము, ధూళి మొత్తం పోయి మీ షూస్ తెల్లగా మెరిసిపోతాయి.