Fridge Cleaning: ఫ్రిజ్ ను ఇలా క్లీనింగ్ చేస్తే మళ్లీ మళ్లీ పాడవ్వదు
life Jun 03 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
క్లీనర్ వాడకంలో జాగ్రత్త
ఫ్రిడ్జ్ క్లీనింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. గాఢమైన క్లీనర్లను వాడితే వాటి ప్రభావానికి పాడయ్యే ప్రమాదం ఉంది. జెంటిల్ క్లీనర్లు బెటర్.
Image credits: Getty
Telugu
మరకలు పోవాలంటే..
మరో విషయం..క్లీనర్ వాడేటప్పుడు ముందుగానే పరీక్షించాలి. పాడైన వస్తువులపై ట్రై చేయాలి. డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ మీద ప్రయోగిస్తే మరకలు పడే అవకాశం ఉంది.
Image credits: Getty
Telugu
ఎప్పుడు క్లీన్ చేయాలి?
కొంతమందికి శుభ్రం ఎక్కువ. అందుకని వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు. అలా చేస్తే త్వరగా పాడవుతుంది. మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేస్తే చాలు. మరీ మురికిగా ఉంటే తప్పదు.
Image credits: Getty
Telugu
వాడాల్సిన వస్తువులు
క్లీనర్, స్పాంజ్, మైక్రోఫైబర్ క్లాత్, బ్రష్ వంటివి వాడితే ఫ్రిజ్‌ను చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. తళతళా మెరుస్తుంది.
Image credits: chatgpt
Telugu
పాడైన ఆహారం వద్దు
పాడైపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకండి. వాటి వల్ల ఫ్రిజ్‌లో చెడు వాసన వస్తుంది. మిగతా పదార్థాలకు అంటుకుంటుంది. వీలైనంత మేర ఎప్పుటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఉత్తమం.
Image credits: Getty
Telugu
ఫ్రిజ్ భాగాలు
ఫ్రిజ్‌లోని అన్ని భాగాలు, ట్రేలను బయటకు తీసి శుభ్రం చేయాలి. చిన్న చిన్న సందుల్లో మురికి పేరుకుపోయే అవకాశం ఉంది. పైపైన శుభ్రం చేస్తే..పేరుకుపోయిన మురికి వల్ల కూడా దుర్వాసన రావొచ్చు.
Image credits: Getty
Telugu
పొడిగా తుడవాలి
శుభ్రం చేశాక, పొడి టవల్‌తో ఫ్రిజ్‌ను బాగా తుడవాలి. తేమ అస్సలు ఉండకుండా చూసుకోవాలి.