టమాటాలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే ఇలా చేయండి చాలు!
life Jul 16 2026
Author: Kavitha G Image Credits:Getty
Telugu
సూర్యరశ్మి
టమాటా మొక్కకు కాయలు కాయాలంటే మంచి సూర్యరశ్మి అవసరం. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో మొక్కలను ఉంచాలి.
Image credits: Getty
Telugu
నీరు పోసే విధానం
మొక్కకు సరైన సమయానికి నీరు పోయడం చాలా ముఖ్యం. మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి, కానీ నీరు నిలిచిపోకూడదు. ఉదయాన్నే నీళ్లు పోయడం మంచిది.
Image credits: Getty
Telugu
ఫంగల్ ఇన్ఫెక్షన్లు
నీటిని నేరుగా మొక్క మొదట్లో పోయాలి. ఆకులు, కాండం మీద నీళ్లు పడితే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
Image credits: Getty
Telugu
కర్రతో సపోర్ట్
మొక్క కొంచెం పెరగగానే, దానికి సపోర్ట్‌గా ఒక కర్రను పాతాలి. టమాటాల బరువుకు కొమ్మలు విరిగిపోకుండా, కాయలు నేలకు తగిలి కుళ్లిపోకుండా ఇది కాపాడుతుంది.
Image credits: Getty
Telugu
ఎరువుల వాడకం
మొక్కను నాటేటప్పుడు మట్టి మిశ్రమంలో పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కలపాలి. మొక్క పెరిగేకొద్దీ, ప్రతి 15 రోజులకు ఒకసారి వేరుశనగ పిండి, వేపపిండి, లేదా గంజి నీళ్లను పలచగా చేసి పోయాలి.
Image credits: Getty
Telugu
ప్రూనింగ్
మొక్క అడుగు భాగంలో, నేలకు దగ్గరగా ఉన్న ఆకులను కత్తిరించాలి. దీనివల్ల మట్టి నుంచి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
Image credits: Getty
Telugu
తెగుళ్ల నివారణ
టమాటా మొక్కలను ఆకుముడత, తెల్లదోమ ఎక్కువగా ఆశిస్తాయి. వీటి నివారణకు, వారానికి ఒకసారి వేపనూనె-వెల్లుల్లి మిశ్రమాన్ని చల్లాలి. ఇలా చేస్తే మొక్క బాగా పెరిగి ఎక్కువ కాయలు వస్తాయి.