సచిన్ కుమార్తె సారా తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF) డైరెక్టర్ గా నియమితులయ్యారు.
ముంబై 'బాంబే క్లబ్' లో జరిగిన ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవంలో సారాను STF డైరెక్టర్ గా ప్రకటించారు.
సారా లండన్ యూనివర్సిటీ కాలేజీలో మెడిసిన్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
సారా విద్యార్హతలు, సచిన్ ఫౌండేషన్ ఆరోగ్య, ప్రజా సంక్షేమ లక్ష్యాలకు సరిపోతాయి.
STF గత 5 ఏళ్లలో లక్షకు పైగా పిల్లలకు, వారి కుటుంబాలకు ఆరోగ్య, విద్యా సంబంధిత సహాయం అందించారు.
సారా చదువుతో పాటు మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్నారు. ఆమె శైలి, వ్యక్తిత్వం ఫ్యాషన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇన్‌స్టాలో సారాకు 74 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన జీవనశైలి, వ్యాయామం, జీవితంలోని వివిధ అంశాలను పంచుకుంటారు.
26 ఏళ్ల సారా ఆస్తుల విలువ సుమారు 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉంది. మోడలింగ్, బ్రాండ్ ప్రకటనలు, ఫ్యాషన్ ఆమె ఆదాయ మార్గాలు.
కడుపు ఉబ్బరానికి.. మీరు చేసే ఈ తప్పులే కారణం
పిల్లలు తక్కువ బరువుతో పుట్టారా? అయితే ఈ చిట్కాలు పాటించండి
పాదాలు అందంగా కనబడాలంటే.. ఈ ట్రెండీ మెట్టెలు ట్రై చేయాల్సిందే!
బర్గర్, సమోసాలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో తెలుసా?