Lifestyle
మీకు తెలుసా? గోర్లను కొరికితే అంటువ్యాధులొస్తాయి. బ్యాక్టీరియా గోర్ల గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించి పరోనిచియా వంటి అంటువ్యాధులకు కారణమవుతుంది.
చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడల్లా గోర్లను తెగ కొరికేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల వేళ్లకు దంతాల నష్టం జరుగుతుంది.
ఒత్తిడి వల్ల గోర్లను కొరకడం వల్ల మీ చిగుళ్లు దెబ్బతింటాయి. ఇది ప్రతిచర్య, వాపు లేదా చిగుళ్ల వ్యాధికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గోర్లను ఎప్పుడూ కొరకడం వల్ల మీ గోర్లు వికృతంగా మారుతాయి. అలాగే పెళుసులుగా, బలహీనంగా ఉంటాయి.
గోర్లలో ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు ఉంటాయి. ఇవి నోటి ద్వారా వ్యాప్తి చెంది ఎన్నో రోగాలకు దారితీస్తాయి.
మీరు ఎప్పుడూ గోర్లను కొరకడమంటే.. మీరు ఒత్తిడికి, యాంగ్జైటీకి గురవుతున్నారని అర్థం. ఇది మీ మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.