Lifestyle
రోజూ మీరు ఉదయాన్నే పరిగడుపున ఉప్పు నీళ్లను తాగితే మీ శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని ఉప్పు నీళ్లను తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉప్పు నీళ్లలో పొటాషియం, సోడియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లను తాగితే ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి.
ఉప్పు నీళ్లను తాగితే లాలాజల గ్రంధులు ఉత్తేజపడతాయి. దీంతో మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
సాల్ట్ వాటర్ లో ఉండే ఖనిజాలు వాపును తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతాయి.ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
ఉప్పు నీళ్లను తాగడం వల్ల గొంతు నొప్పి తొందరగా తగ్గుతుంది. అలాగే శ్వాసకోశంలో వాపు కూడా తగ్గుతుంది.