Telugu

Pillow: మీ దిండు గట్టిగా రాయిలా మారిందా? మళ్లీ మెత్తగా మార్చే ట్రిక్స్

Telugu

దిండు గట్టిగా మారితే...

దిండు లోని కాటన్ అంతా ఒకేచోట చోరి గట్టిగా, రాయిలా మారుతుంది. అలాంటి దిండు వాడితే మెడనొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.  ఇలాంటి సమయంలో కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..

Image credits: Getty
Telugu

చేతితో దిండును దులపండి

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే, దిండును నాలుగు వైపుల నుంచి చేతితో గట్టిగా దులపండి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న దూది సమానంగా సర్దుకుంటుంది.
Image credits: Getty
Telugu

ఎండలో ఆరబెట్టండి

వారానికి ఒకసారి దిండును 2-3 గంటల పాటు మంచి ఎండలో పెట్టండి. ఎండ వేడికి దూదిలో ఉన్న తేమ పోయి, మళ్లీ ఉబ్బినట్లుగా తయారవుతుంది.
Image credits: Freepik
Telugu

టెన్నిస్ బాల్ ట్రిక్

మీరు వాషింగ్ మెషీన్‌లో దిండును ఉతుకుతున్నట్లయితే, దానితో పాటు రెండు టెన్నిస్ బాల్స్‌ను శుభ్రమైన సాక్స్‌లో వేసి, ముడివేసి మెషీన్‌లో వేయండి. దిండు పాడవ్వకుండా ఉంటుంది

Image credits: Freepik
Telugu

దూదిని విడదీయండి

దూది దిండు మరీ గట్టిగా మారితే, దాని కవర్ విప్పి లోపలి దూదిని చేతులతో బాగా విడదీయండి. ఆ తర్వాత మళ్లీ ఆ దూదిని కవర్‌లో నింపితే, దిండు కొత్తదానిలా మెత్తగా మారుతుంది.
Image credits: Freepik
Telugu

వాషింగ్ మెషీన్ డ్రయర్

దిండును డ్రయర్‌లో వేసేటప్పుడు, దానితో పాటు ఒక పొడి టవల్ కూడా వేయండి. ఇది దిండులో ఉన్న తేమను పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది.
Image credits: Freepik
Telugu

వెనిగర్, బేకింగ్ సోడా

దిండును ఉతికేటప్పుడు కొద్దిగా వెనిగర్, బేకింగ్ సోడా వాడితే, అది దిండు ఫ్యాబ్రిక్‌ను మెత్తగా మార్చడమే కాకుండా, క్రిములను కూడా నాశనం చేస్తుంది.
Image credits: Freepik
Telugu

ఎక్కువ కాలం మెత్తగా ఉండాలంటే..

దిండులకు ఎప్పుడూ డబుల్ కవర్ వాడండి. ఇది చెమట, నూనె జిడ్డు నేరుగా లోపలి దూదికి చేరకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల దిండు ఎక్కువ కాలం మెత్తగా ఉంటుంది.
Image credits: Getty

Green Stone Toe Rings: పాదాల అందం పెంచే గ్రీన్ స్టోన్ వెండి మెట్టెలు

Bugadi Earrings: 1 గ్రాము గోల్డ్ లో ట్రెండీ బుగాడీ ఇయర్ రింగ్స్

Gold Black Beads: 6 గ్రాముల్లో లాంగ్ నల్లపూసల దండ.. ఓ లుక్కేయండి

Gold Earrings: స్క్వేర్ షేప్ హూప్ ఇయర్ రింగ్స్.. మోడ్రన్ లుక్ మీ సొంతం