ఎక్కువగా మద్యం సేవించడం లేదా ఆల్కహాల్ తాగడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. దీంతో మీరు తర్వరగా ముసలిగా కనబడతారు.
పొగ తాగేవారిలో చర్మంపై ముడతలు, గీతలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని త్వరగా ముసలోళ్లను చేస్తుంది. కాబట్టి ధూమపానాన్ని వీలైనంత వరకు మానుకోండి.
నిద్ర లేమి శరీరంలో నల్లటి మచ్చలకు, వయసు పెరిగినట్లు కనిపించడానికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో 7 నుండి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.
ఎక్కువగా నూనెలో వేయించిన, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, అతిగా చక్కెర తీసుకుంటే మీలో త్వరగా ముసలి లక్షణాలు వస్తాయి.
శరీరంలో తగినంత నీరు లేకపోయినా ముఖం వయసు పెరిగినట్లు కనిపిస్తుంది. కాబట్టి నీళ్లు బాగా తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.
వ్యాయామం లేకపోవడం శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
ఎక్కువగా ఎండలో ఉండటం, సన్‌స్క్రీన్ క్రీములు వాడకపోవడం వంటివి చర్మ సమస్యలకు దారితీస్తాయి.
ఇలా చేస్తే కీళ్ల నొప్పులు పోతాయి !
Inauspicious Plants: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే శుభం జరగదు
Uric Acid Relief: యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుత పండు ఇదే
మీ కిడ్నీలు పాడైపోతున్నాయా? ఇదిగో సంకేతం