కాఫీ పొడి ఒక స్పూను తీసుకోవాలి. నిమ్మరసం, పెరుగు అర చెంచా చొప్పును తీసి పక్కన పెట్టుకోవాలి.
కాఫీ పొడి, నిమ్మరసం (లేదా పెరుగు) కలిపి బాగా పేస్ట్‌లా చేసుకోండి. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
పావుగంటసేపు ముఖాన్ని ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేస్తూ నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ కాఫీ ఫేస్ ప్యాక్ వల్ల నల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. ముడతలు పోయి చర్మం బిగుతుగా మారుతుంది.ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీ చర్మానికి పడితేనే వాడండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు నిమ్మరసం బదులు పెరుగు వేసుకోవాలి.
కాఫీ పొడి చర్మంపై పేరుకుపోయిన చనిపోయిన కణాలను తొలగిస్తుంది. చర్మ ఆకృతిని మృదువుగా మారుస్తుంది.
కాఫీ పొడిని స్క్రబ్ లా వాడితే వల్ల చర్మం కింద ఉన్న కొవ్వు నిల్వలు చాలా వరకు తగ్గుతాయి.చర్మం మృదువుగా మారుతుంది.
Gold Earrings: మీ చిన్నారి కోసం బంగారు చెవిదిద్దులు.. ఎంత బాగున్నాయో!
Choker Designs: గోల్డ్ ప్లేటెడ్ చోకర్ డిజైన్లు.. కొనకుండా ఉండలేరు
Fashion Tips: అదిరిపోయే డిజైన్‍లో రెడ్ శారీస్.. అక్షయ తృతీయకు బెస్ట్
Platinum Earrings: 1గ్రాములో ప్లాటినం ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి బెస్ట్