కొబ్బరి బొండం కొనేటప్పుడు అందులో నీళ్లు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఈ కింద చెప్పే సింపుల్ టిప్స్ ఫాలో అయితే, మీరే స్మార్ట్‌గా మంచి కాయను ఎంచుకోవచ్చు.
life Mar 28 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
ఊపి చూడండి
కొబ్బరి బొండాన్ని చెవి దగ్గర పెట్టుకుని ఊపండి. లోపల నీళ్లు కదులుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తే, అందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని అర్థం.
Image credits: Getty
Telugu
బరువు చెక్ చేయండి
చేతిలోకి తీసుకున్నప్పుడు, దాని సైజు కన్నా ఎక్కువ బరువుగా అనిపిస్తే, అందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని అర్థం. తేలికగా ఉంటే, నీళ్లు తక్కువగా ఉండి లేత కొబ్బరి ఎక్కువగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
రంగు, ఆకారం గమనించండి
ఎప్పుడూ పచ్చగా, గుండ్రంగా ఉన్న కొబ్బరి బొండాన్నే ఎంచుకోండి. బ్రౌన్ కలర్‌లోకి మారినవి లేదా ఆకారం మారిన కాయల్లో నీళ్లు ఇంకిపోయి, కొబ్బరి ఎక్కువగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
మచ్చలు ఉన్నాయా? చూడండి
కొబ్బరి బొండం పైభాగంలో నల్లటి మచ్చలు లేదా పగుళ్లు ఉంటే, అలాంటి కాయను అస్సలు తీసుకోవద్దు.
Image credits: Getty
Telugu
రుచి, తాజాగా ఉండాలంటే..
కొబ్బరి బొండం కొన్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దు. ఇంటికి తెచ్చిన వెంటనే తాగేస్తేనే దాని రుచి, తాజాదనం బాగుంటాయి.