Dark Circles: ఇలా చేస్తే వారంలో డార్క్ సర్కిల్స్ మాయం
life Apr 20 2026
Author: Nandini Arava Image Credits:our own
Telugu
డార్క్ సర్కిల్స్ పోవాలంటే 7 హోం రెమిడీస్
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అందాన్ని తగ్గించడమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి ఇక్కడ 7 సులభమైన చిట్కాలు ఉన్నాయి.
Image credits: gemini
Telugu
కీర దోసకాయ
కీర దోసకాయ ముక్కలను కళ్లపై 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇది నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: gemini
Telugu
బంగాళదుంప
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి బంగాళదుంప బాగా పనిచేస్తుంది. బంగాళదుంపను తురిమి లేదా గుండ్రని ముక్కలుగా కోసి 10 నిమిషాల పాటు కళ్లపై పెట్టుకోవాలి.
Image credits: Freepik
Telugu
టీ బ్యాగ్
వాడిన టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. వాటిని కళ్లపై పది నిమిషాల పాటు ఉంచుకోవాలి. రోజూ ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న డార్క్ నెస్ క్రమంగా తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
బీట్‌రూట్
బీట్‌రూట్ రసంలో సమాన పరిమాణంలో తేనె, పాలు కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ప్యాడ్స్ ముంచి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Image credits: Gemini AI
Telugu
పాలు
చల్లని పాలలో రెండు కాటన్ ప్యాడ్స్‌ను ముంచి, కళ్ల కింద నల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. సుమారు ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
Image credits: Getty
Telugu
అలోవెరా జెల్
కలబంద గుజ్జును (అలోవెరా జెల్) కళ్ల చుట్టూ రాయడం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది.