Telugu

Cleaning Tips: ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో..

Telugu

నూనెలు

కర్పూరం,  తులసి, లావెండర్, సిట్రోనెల్లా వంటి నూనెలతో సాలెపురుగులకు చెక్ పెట్టవచ్చు. కొన్ని నీళ్ళలో రెండు చుక్కల నూనె వేసి మూలలు, కిటికీలు, తలుపులకు స్ప్రే చేస్తే చాలు.

Image credits: Getty
Telugu

వినెగర్

సాలెపురుగులను తరిమికొట్టడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. నీరు, వినెగర్ లను సమపాళ్లలో కలిపి సాలెపురుగులు కనిపించే ప్రాంతంలో స్ప్రే చేస్తే చాలు.

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లి వాసన సాలెపురుగులకు నచ్చదు. కాబట్టి సాలెపురుగులు వచ్చే చోట వెల్లుల్లి స్ప్రే చేయండి.

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్ల వాసనతో  సాలీడులను తరిమికొట్టవచ్చు. నీరు, నిమ్మ లేదా నారింజ తొక్కలను కలిపి స్ప్రే తయారుచేయండి. ఈ స్ప్రేను సాలెపురుగులు కనిపించే ప్రాంతంలో స్ప్రే చేస్తే చాలు. 

Image credits: Getty
Telugu

ఘాటైన వాసనలతో

పుదీనా, రోజ్‌మేరీ, లావెండర్ వంటి మొక్కల వాసన సాలెపురుగులకు నచ్చదు. ఈ మొక్కల వాసన సాలెపురుగులకు వికర్షకంగా పనిచేస్తుంది, వాటిని ఇంట్లో లేదా చుట్టుపక్కల రాకుండా చేస్తుంది.

Image credits: Getty
Telugu

పరిశుభ్రత

ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే.. కీటకాలు, చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంటిని క్రమంగా శుభ్రం చేస్తూ.. చెత్తను వెంటనే పారవేయాలి.  

Image credits: Getty
Telugu

పిప్పరమింట్ ఆయిల్

సాలెపురుగులను తరిమికొట్టడానికి పిప్పరమింట్ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు.  పిప్పరమింట్ ఆయిల్ ను పిచికారీ చేస్తే  ఆ వాసనకు సాలెపురుగులు దరిచేరవు

Image credits: Getty

Health Tips: జిమ్‌కి వెళ్లట్లేదా? ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలు చేయండి

Health Tips: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌ తప్పనిసరి !

Milk : రోజూ రాత్రి పాలు తాగితే.. శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా?

Watermelon: ఖాళీ కడుపుతో కర్భూజ తింటే.. ఇన్ని ప్రయోజనాలా?