Lifestyle
కొబ్బరి నూనెతో మడమల పగుళ్లను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. రాత్రినిద్రపోయే ముందు పగుళ్లకు కొబ్బరి నూనె రాసి సాక్సులు వేసుకోవాలి.
తేనె కూడా పగుళ్లను తగ్గిస్తుంది. ఇది మంచి మాయిశ్చరైజర్ కూడా. ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లలో ఒక కప్పు తేనె కలిపి దాంట్లో మీ పాదాలను 20 నిమిషాలు నానబెట్టండి.
బాదం నూనె, షియా వెన్నతో కూడా పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఈ రెండింటిని కలిపి పగుళ్లకు రాయండి. రోజుకు రెండుసార్లు ఇలా చేయండి. పగుళ్లు తగ్గిపోతాయి.
గ్లిజరిన్, గులాబీ నీళ్లను కలిపి పాదాలకు అప్లై చేసినా పగుళ్లు తగ్గిపోయి.. పాదాలు మృదువుగా అవుతాయి. దీనిని రోజుకు రెండుసార్లు ఉపయోగించాలి.
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి పగుళ్లను తగ్గిస్తాయి.ఇందుకోసం కలబంద జెల్‌ను పాదాలకు రాసి రాత్రంతా అలాగే ఉంచండి. మార్నింగ్ గోరువెచ్చని నీటితో కడిగేయండి.
నిమ్మకాయ, పంచదార స్క్రబ్ స్కిన్ లోని మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో పంచదార కలిపి స్క్రబ్ చేస్తే పాదాల పగుళ్లు తగ్గుతాయి. దీన్ని పాదాలకు రుద్ది 5 నిమిషాల తర్వాత కడిగేయండి.
అరటిపండుతో కూడా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బాగా అరటిపండును మెత్తగా చేసి పాదాలకు పట్టించండి. 5-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.