Lifestyle

ఆ రాష్ట్రాల్లో మద్యం తాగితే జైలుకే

Image credits: Pixabay

బీహార్

ఏప్రిల్ 2016లో బీహార్ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసింది. నేరాలను అరికట్టడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ఈ నిషేధం లక్ష్యం. అయితే అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతోంది. 

Image credits: Instagram

గుజరాత్

1960లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గుజరాత్ మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తోంది. మహాత్మా గాంధీ ఆదర్శాలను ఇక్కడ కచ్చితంగా పాటిస్తారు. రాష్ట్రంలో కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి.

Image credits: Pinterest

మిజోరం

చర్చి, మహిళా సమూహాల నేతృత్వంలో మిజోరం 1997లో మద్యపాన నిషేధాన్ని చేపట్టింది. 2015-2019 మధ్య నిషేధం ఎత్తివేశారు. అయితే తిరిగి నిషేధం అమలు చేస్తున్నారు.

Image credits: సోషల్ మీడియా

లక్షద్వీప్

లక్షద్వీప్ కఠినమైన మద్యపాన చట్టాలను అమలు చేస్తోంది. ద్వీపంలోని కొన్ని రిసార్ట్‌లకు మాత్రమే మద్యం అమ్మకాలు, వినియోగం పరిమితం చేశారు. 

Image credits: సోషల్ మీడియా

నాగాలాండ్

నాగాలాండ్‌లో మద్యపాన నిషేధం 1989 నుండి అమలులో ఉంది. అయితే అక్రమ వ్యాపారం, మద్యం అక్రమ రవాణా ఇప్పటికీ అక్కడ సమస్యలుగానే ఉన్నాయి.

Image credits: Pixabay

కిస్ మిస్ వాటర్ ను తాగితే ఏమౌతుందో తెలుసా

గ్యాస్ తో కడుపు ఉబ్బిపోయిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది

పీఎం మోదీ, అంబానీలు సలహాల కోసం ఎవరిని సంప్రదిస్తారో తెలుసా

వారెన్ బఫెట్ సక్సెస్‌కి కారణం ఎవరో తెలుసా