Telugu

సొరకాయ తినడానికి ఇష్టపడడం లేదా? ఇవి కోల్పోతున్నట్లే..

Telugu

వ్యాధులకు

సొరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

రక్తపోటు

సొరకాయలో పుష్కలమైన నీరు ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
 

Image credits: social media
Telugu

జీర్ణక్రియకు

సొరకాయను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్‌ కంటెంట్‌ మలబద్ధకం, గ్యాస్‌, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. 
 

Image credits: Freepik
Telugu

బరువు తగ్గాలనుకునేవారు

బరువు తగ్గాలనుకునే వారు కూడా కచ్చితంగా సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

సొరకాయలో కాల్షియం కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదే విధంగా ఇందులో మెగ్నీషియం కండరాలను బలోపేతం చేస్తుంది. 

Image credits: Getty
Telugu

కిడ్నీల కోసం

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సొరకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని వాటర్‌ కంటెంట్‌ కిడ్నీ సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. 
 

Image credits: Getty
Telugu

డయాబెటిస్‌

పచ్చి సొరకాయను తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గడంతో పాటు, శరీరంలోని ఇన్సులిన్‌ లెవల్స్‌ను సమతుల్యం చేస్తుంది

Image credits: Getty
Telugu

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి

ముకేష్ అంబానీ ఫేవరేట్ ఫుడ్.. ధర ఇంత చీపా?

పిల్లలకు ఏ వయసు నుంచి ఉప్పు, పంచదార ఇవ్వాలి?

చాణక్య నీతి: సూపర్ ఉమెన్ లో ఉండే లక్షణాలు ఏంటో తెలుసా?