pregnancy & parenting

పిల్లలకు ఏ వయసు నుంచి ఉప్పు, పంచదార ఇవ్వాలి?

మొదటి ఆరు నెలలు

పిల్లలకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఒక సంవత్సరం వరకు ఉప్పు, రెండేళ్లు నిండే వరకు పంచదార పెట్టకూడదు.

 

ఉప్పు పెడితే ఏమౌతుంది?

నవజాత శిశువులకు ఉప్పు ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది, దీనివల్ల వారి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.

చక్కెర వల్ల ఊబకాయం

చక్కెర  ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల పిల్లల్లో త్వరగా ఊబకాయం పెరుగుతుంది. దంతాలు వచ్చే సమయంలో చక్కెర వల్ల దంతక్షయం రావచ్చు.

అలవాటు

చిన్న వయసులో ఉప్పు, చక్కెర ఇవ్వడం వల్ల పిల్లలకు ఆ రుచి అలవాటు చెడిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ఇష్టపడరు.

ఆరోగ్య సమస్యల ప్రమాదం

ఎక్కువ ఉప్పు, చక్కెర పిల్లల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సహజ ఆహారాలు మంచివి

ఉప్పుకు బదులుగా పిల్లలకు పండ్లు, కూరకాయలలో లభించే సహజ సోడియం నుండి పోషణ లభిస్తుంది. చక్కెరకు బదులుగా పండ్లలోని సహజ తీపిని ఇవ్వడం మంచిది.

ఉదయాన్నే పిల్లలకు పేరెంట్స్ ఏం చెప్పాలి?

ఐశ్వర్యా రాయ్ నుంచి తల్లులు నేర్చుకోవాల్సింది ఇదే

పిల్లలు తొందరగా నేర్చుకునే చెడు అలవాట్లు ఇవే

చిన్న పిల్లలకు ఇవి మాత్రం తినిపించకూడదు