పచ్చి మిరపకాయలను నీటిలో వేసి శుభ్రంగా కడగండి. తరువాత ఒక పొడి వస్త్రంతో వాటిని తడి లేకుండా తుడిచి కాసేపు గాలిలో ఆరబెట్టండి.
ఆ తరువత పచ్చి మిరపకాయల తొడిమలు తీసేయండి. అలా తీయడం అవి ఎక్కువ కాలం పాటూ తాజాగా నిల్వ ఉంటాయి.
పచ్చి మిరపకాయలను స్టోర్ చేసేందుకు గాలి చొరబడని డబ్బాను తీసుకోండి. ముందుగా దానిలో ఒక టిష్యూ పేపర్ పెట్టండి. తేమను ఆ పేపర్ పీల్చేసుకుంటుంది.
పచ్చి మిరపకాయలు స్టోర్ చేసేందుకు ప్లాస్టిక్ డబ్బా కాకుండా గాజు కంటైనర్ వాడడం ముఖ్యం. దీనివల్ల పచ్చిమిర్చి ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉంటాయి.
పచ్చి మిరపకాయలు స్టోర్ చేసిన డబ్బాను ఫ్రిజ్ కింద ఉండే కూరగాయల ర్యాక్ లో పెట్టాలి. అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.
పచ్చి మిరపకాయలకు ఆవ నూనెను పూసి నిల్వ చేసే పద్ధతి కూడా ఉంది. ఇలా చేసినా కూడా పాడవవు. అంతే కాదు ఆ పచ్చిమిర్చి మంచి రుచిని కూడా అందిస్తాయి.
అత్యంత అందమైన పురుషులు ఉన్న దేశం ఇదే
Gold Jhumka: 5 గ్రాముల్లో గోల్డ్ జుంకాలు.. చూస్తే ఫిదా అయిపోతారు!
Vastu Tips: ఈ పూల మొక్కలు ఇంట్లో ఉంటే డబ్బులే డబ్బులు!
ఈ కూరగాయలు పచ్చిగా తింటే ఆరోగ్యం