Lifestyle
అవును చక్కెర కూడా మీ జుట్టు చిన్న వయసులోనే తెల్లగా కావడానికి కారణమువుతంది. అందుకే శుద్ధి చేసిన చక్కెర ఉన్న ఆహారాలను తినకండి. ఇవి మీ జుట్టు చిన్న వయసులోనే తెల్లబడేలా చేస్తాయి.
ఉప్పు మన ఆరోగ్యానికి అవసరమే అయినా.. దీన్ని ఎక్కువగా తీసుకుంటే జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే మీ వెంట్రుకలు తెల్లగా అయ్యేలా చేస్తుంది.
వేయించిన ఆహారాలు మంచి టేస్టీగా ఉంటాయి. వీటిని తింటే మీ ఆరోగ్యమే కాదు మీ జుట్టు కూడా దెబ్బతింటుంది. అందుకే వీటిని అతిగా తినకండి.
టీ, కాఫీలను తాగనివారు ఎవరూ ఉండరేమో. కానీ వీటిని ఓవర్ తాగకూడదు. మీకు తెలుసా? కాఫీని ఎక్కువగా తాగితే మీ శరీరం నీరసంగా మారుతుంది. అంతేకాదు మీ జుట్టు కూడా తెల్లబడుతుంది.
ప్యాక్ చేసిన ఫుడ్స్ కూడా బలే టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని తింటే మీ జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతుంది.
ఆల్కహాల్ ను అతిగా తాగితే శరీరంలోని అవయవాలు దెబ్బతినడమే కాకుండా.. మీ జుట్టు కూడా తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.