Lifestyle
చేప తలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెటీనాను కాపాడి, కంటి చూపును మెరుగు పరుస్తుంది.
చేప తలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
కిడ్నీలో సమస్యలతో బాధపడేవారికి కూడా చేప తలకాయ బాగా ఉపయోగపడుతుంది. చేప తలను రెగ్యులర్‌గా తీసుకుంటే కిడ్నీ రాళ్లు కరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
చేప తలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు దరిచేరకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ధమనుల్లో అడ్డుగోడలు పేరుకుపోకుండా చేస్తాయి.
షుగర్ పేషెంట్స్‌కు కూడా చేప తలకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతాయి.
చర్మ ఆరోగ్యానికి చేప తల ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులోని విటమిన్ డి, బి2 చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
ఈ వివరాలు ప్రాథమి సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.