Food
ఖర్జూరాలు ఐరన్‌కి చాలా మంచి మూలం, 100 గ్రాములకి 1 మి.గ్రా. ఐరన్‌ని అందిస్తాయి. ఇవి ఫైబర్, సహజ చక్కెరలతో నిండి ఉంటాయి, శక్తిని పెంచే ఆరోగ్యకరమైన చిరుతిండి.
ఎండు ద్రాక్ష 100 గ్రా.కి 0.9 మి.గ్రా. ఐరన్‌ని అందిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
మల్బరీలు 100 గ్రా.కి 1.9 మి.గ్రా. ఐరన్‌ని కలిగి ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లతో నిండి, మొత్తం ఆరోగ్యాన్ని, శక్తిని పెంచుతాయి.
ఆప్రికాట్ 100 గ్రా.కి 2.7 మి.గ్రా. ఐరన్‌ని అందిస్తాయి. ఇవి పొటాషియం మూలం, గుండె ఆరోగ్యానికి, శక్తి స్థాయిలకు మంచివి.
కిస్మిస్ 100 గ్రా.కి 1.6 మి.గ్రా. ఐరన్‌ని కలిగి ఉంటుంది. ఇవి తినడానికి సులభం, పొటాషియం, ఫైబర్‌ని అందిస్తాయి.
దానిమ్మ పోషకాల గని, 100 గ్రా.కి 0.3 మి.గ్రా. ఐరన్‌ని అందిస్తుంది. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, శక్తి ఉత్పత్తికి అవసరమైన విటమిన్లను అందిస్తాయి.
అంజీర, ముఖ్యంగా ఎండినవి, 100 గ్రా.కి 2.03 మి.గ్రా. ఐరన్‌ని అందిస్తాయి. ఫైబర్, ఖనిజాలతో నిండి, ఐరన్ అధికంగా ఉండే ఆహారంలో మంచివి.