Lifestyle

తొందరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి

నిద్రలేమికి పరిష్కారాలు

నిద్రలేమి చిన్న సమస్యగా అనిపించినా ఇది ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మీకు బాగా నిద్రపట్టేలా చేస్తాయి. అవేంటంటే?

నిద్ర కోసం అరటిపండ్లు

అరటి పండ్లు నిద్రలేమిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం, పొటాషియం కండరాల సడలింపునకు సహాయపడతాయి. దీంతో మీకు బాగా నిద్రపడుతుంది.

నిద్ర కోసం వెచ్చని పాలు

గోరువెచ్చని పాలు తాగినా మీకు బాగా నిద్రపడుతుంది. వేడి పాలలో ఉండే ట్రిప్టోఫాన్ మీకు తొందరగా నిద్రపట్టేలా చేస్తుంది. 

నిద్ర కోసం ఓట్స్

ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడే సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి.ఇవి మీకు బాగా నిద్రొచ్చేలా చేస్తాయి.

సెరోటోనిన్, నిద్ర

సెరోటోనిన్ నిద్రను నియంత్రించడానికి, నిద్రలేమిని తగ్గించడానికి సహాయపడుతుంది.

నిద్ర కోసం బాదం

బాదం కూడా మీకున్న నిద్రలేమి సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. రోజూ బాదం పప్పులను తింటే మీకు బాగా నిద్రపడుతుంది. 

నిద్ర కోసం ధ్యానం

 ధ్యానాలు కూడా నిద్రలేమి సమస్యను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 

Find Next One