Lifestyle
మొటిమలు రకరకాల కారణాలతో వస్తాయి. వాటిని తగ్గించే చిట్కాలు ఇక్కడ చూద్దాం.
మొటిమలు తగ్గించడానికి ఇంట్లో ఉండే సహజ పదార్థాలు చాలా ఉపయోగపడతాయి.
ఓట్స్, గుడ్డులోని తెల్లసొన బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయొచ్చు.
మొటిమలు ఉన్న చోట కొద్దిగా తేనె రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
వేడి నీటిలో జామ ఆకులను మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి.
ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని 2 టీస్పూన్ల తేనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాసి 10-15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి.
ఒక దోసకాయని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ రసంలో కాటన్ బాల్ ముంచి మొటిమలపై పెట్టాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.