Food
విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది
నానబెట్టిన బాదం తినడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. బాదం వంటి గింజల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది.
బాదం ప్రోటీన్, ఫైబర్ కి మంచి మూలం. బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి.
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. నానబెట్టినప్పుడు, బాదంలోని విటమిన్ ఇ శరీరం సులభంగా గ్రహిస్తుంది.
బాదం ఎంతసేపు నానబెట్టాలి అనే దాని గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. 8 నుండి 12 గంటల వరకు బాదం నానబెట్టిన తర్వాత తినవచ్చు.
బాదం నానబెట్టి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడుతుంది.
రాత్రి నీళ్లలో వేయడం మర్చిపోతే, ఉదయం అరగంటైనా గోరువెచ్చని నీటిలో నానబెడితే తొక్క సులభంగా ఊడిపోతుంది.