మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!
life Jun 27 2026
Author: Kavitha G Image Credits:Social media
Telugu
కలబంద జెల్
కలబంద జెల్‌ను రోజూ ముఖానికి, మెడకు రాసుకోవడం చాలా మంచిది. దీనిలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల వల్ల వచ్చే ఎరుపుదనాన్ని, వాపును తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu
ఐస్ క్యూబ్
ఒక ఐస్ క్యూబ్‌ను శుభ్రమైన బట్టలో చుట్టి, మొటిమలు ఉన్న చోట 5 నుంచి 10 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి. ఇది రక్తనాళాలను సంకోచింపజేసి వాపు, ఎరుపును వేగంగా తగ్గిస్తుంది.
Image credits: Freepik
Telugu
టీ ట్రీ ఆయిల్
యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలున్న టీ ట్రీ ఆయిల్‌ను ముఖానికి రాసి 15 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
Image credits: Getty
Telugu
తేనె
తేనెలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. మొటిమలు ఉన్న చోట కొద్దిగా తేనె రాసి, 15-20 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ టోనర్
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. గ్రీన్ టీ తయారు చేసి, చల్లార్చి, కాటన్ ప్యాడ్‌తో ముఖానికి అప్లై చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టి ముఖంపై అదనపు నూనెను పీల్చుకుని, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.