Hair Growth: ఇదొక్కటి రాస్తే మీరు వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
woman-life Jun 27 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
చుండ్రు సమస్యకు చెక్
నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్.. చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నాశనం చేస్తుంది. కొబ్బరి నూనె తల మాడు (Scalp) పొడిబారకుండా తేమగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
జుట్టు కుదుళ్లకు బలం
కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టులోని ప్రోటీన్‌ను కాపాడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారి, జుట్టు రాలడం తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
pH బ్యాలెన్స్
నిమ్మరసం తల మాడు pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది తలలోని అధిక జిడ్డును తొలగించి, దురదను తగ్గిస్తుంది.
Image credits: adobe stock
Telugu
మృదువైన, మెరిసే జుట్టు
కొబ్బరి నూనె జుట్టుకు తేమను (Moisture) అందిస్తుంది. నిమ్మరసం తలలోని మురికిని శుభ్రం చేస్తుంది. దీంతో జుట్టు పట్టులా మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది.
Image credits: Freepik
Telugu
ఒత్తైన జుట్టు పెరుగుదల
ఈ మిశ్రమంతో మాడుకు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల హెయిర్ ఫోలికల్స్ (Follicles) యాక్టివ్ అవుతాయి. ఫలితంగా జుట్టు వేగంగా, ఒత్తుగా పెరుగుతుంది.
Image credits: Freepik
Telugu
ఎలా ఉపయోగించాలి?
ఒక చెంచా నిమ్మరసంలో 2 చెంచాల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. నిమ్మరసాన్ని కొబ్బరి నూనెతో కలిపి వాడాలి.