Telugu

బెండకాయల మొక్కలను కుండీల్లో సులువుగా పెంచండి

Telugu

ఎప్పుడు విత్తనాలు నాటాలి?

బెండకాయలు పెరగడానికి వెచ్చని వాతావరణం కావాలి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వీటి విత్తనాలు నాటుకోవాలి. జులై లేదా ఆగస్టు నెలల్లో కూడా విత్తనాలు నాటుకోవచ్చు.

Image credits: Getty
Telugu

చల్లని వాతావరణంలో పెరగవు

వాతావరణం మరీ చల్లగా ఉంటే బెండ విత్తనాలు మొలకెత్తవు. అందుకే వెచ్చని వాతావరణంలోనే అంటే ఎండాకాలంలోనే కుండీల్లో విత్తనాలు నాటి.

Image credits: Getty
Telugu

కుండీ, మట్టి ఎంపిక

కనీసం 12 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీని ఎంపిక చేసుకోవాలి. కుండీ అడుగున రంధ్రం ఉండాలి.  మట్టిలో పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్ట్ కలపాలి. 

Image credits: Getty
Telugu

విత్తనాలు నాటే పద్ధతి

మట్టిలో సుమారు 1 నుంచి 1.5 అంగుళాల లోతులో విత్తనాలు నాటండి. రెండు మొక్కల మధ్య కనీసం 6 నుంచి 8 అంగుళాల దూరం ఉండాలి. విత్తనాలు నాటాక నీళ్లు చిలకరించండి. 8 రోజుల్లో మొలకలు వస్తాయి.

Image credits: Getty
Telugu

మొక్కల సంరక్షణ

మొలకలు వచ్చాక రోజులో కనీసం 5 గంటల పాటు నేరుగా ఎండ తగిలేలా ఉంచాలి. మట్టిలో తేమ ఉండేలా చూసుకోండి. నీరు నిలిచిపోకుండా చూడండి. నీటిలో వేప నూనె కలిపి పిచికారీ చేయండి.

Image credits: Getty
Telugu

పంట కోత

విత్తనాలు నాటిన 40-50 రోజుల్లో బెండకాయలు కాయడం మొదలవుతాయి. బెండకాయ 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరిగాక వెంటనే కోసేయాలి. 

Image credits: pixabay
Telugu

ఎరువు తప్పకుండా వేయాలి

మొక్కలు నాటేటప్పుడు మట్టిలో సరైన మోతాదులో ఎరువు వేసి కలపాలి. మళ్లీ మళ్లీ ఎరువు వేయాల్సిన అవసరం ఉండదు. 

Image credits: Getty

Gold Rings: 2 గ్రాముల్లో క్రౌన్ షేప్ బంగారు ఉంగరాలు.. ఓ లుక్కేయండి

Gold: పిల్లలకు క్యూట్ పాపిట బిల్ల.. అందంగా మెరిసిపోతారు

Agarbatti Tips: అగరుబత్తీల వాసన ఏడాదంతా ఉండాలా? ఈ సీక్రెట్ తెలుసా?

Cooking Oil: వంటకు బెస్ట్ నూనె ఇదే