Lifestyle
మీ భార్యను ఏ విషయంలో కూడా ఇతరులతో పోల్చకండి. ఈ పని పలానా వ్యక్తి అయితే ఇంకా బాగా చేసేది అన్న మాటలు అస్సలు ఉపయోగించకండి. ఇది మీ మధ్య గొడవకు దారి తీస్తుంది.
మీ భార్య అందం గురించి నెగిటివ్ అంశాలను అస్సలు ప్రస్తావించకండి. భర్త నుంచి ఇలాంటి మాటలను వారు అస్సలు ఊహించరు. వారిలోని పాజిటివ్ అంశాలనే ప్రస్తావించండి.
మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవి మీ వరకే పరిమితం చేసుకోండి. మరో వ్యక్తి ముందు మీ భార్యను అస్సలు నిందించకండి. అది వారిని మరింత బాధిస్తుంది.
'నిన్ను కాకుండా వేరే వారిని పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుండేది'. ఇలాంటి మాటలు పొరపాటున కూడా మీ నోటి నుంచి రాకూడదు. ఈ మాటలు భార్యను ఎంతో బాధకు గురి చేస్తాయని మరవకండి.
భార్యలను అవహేళనతో మాట్లాడడం మానుకోవాలి. వెంటనే నోరు పారేసుకోవడం మానుకోవాలి. ఇలాంటివి మీ భాగస్వామిని మీ నుంచి దూరం చేస్తాయని గుర్తుపెట్టుకోండి.
కొందరు భర్తలు ప్రతీ చిన్న దానికి భార్య పుట్టింటి వారిని నిందిస్తుంటారు. ఇది భార్యలకు ఏ మాత్రం నచ్చదు. మీ అభిప్రాయాలు మీతోనే ఉంచుకోండి, తప్ప భార్యలతో పంచుకోకండి.
నీకు ఏది చేతకాదు అన్న పదాన్ని కూడా భార్యల ముందు వాడకండి. ఇది వారి ఆత్మన్యూనత భావాన్ని దెబ్బతీస్తుంది. మీ బంధాన్ని దూరం చేస్తుంది.