Woman
నట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వాల్ నట్స్, బాదం పప్పులు, పిస్తా, జీడిపప్పులను తింటే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది.
ఈ గింజల్లో రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
రోజూ నానబెట్టిన బాదం పప్పులను తింటే మీ జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. ఈ పప్పుల్లో బయోటిన్, విటమిన్ ఇ,మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.ఇవి జుట్టుకు పోషణను అందిస్తుంది.బలంగా ఉంచుతాయి.
జీడిపప్పుల్లో ఐరన్, జింక్ మెండుగా ఉంటాయి. ఈ పప్పులను తింటే జుట్టు మంచి పోషణ అంది మీ జుట్టు పొడుగ్గా, బలంగా పెరుగుతుంది. ఇవి చలికాలంలో మీ జుట్టు రాకుండా చేస్తాయి.
పిస్తాల్లో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పులను తింటే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
వాల్ నట్స్ ను తింటే మీ జుట్టు మంచి పోషణ అందుతుంది. వీటిని తింటే జుట్టు మూలాలు బలంగా అవుతాయి. దీంతో జుట్టు రాలడం, చిట్లిపోవడం తగ్గుతుంది. చలికాలంలో మీ జుట్టు షైనీగా ఉంటుంది.
పల్లీలు కూడా జుట్టుకు మేలు చేస్తాయి. వీటిలోఉండే బయోటిన్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు పోషణను అందిస్తాయి. అలాగే హెయిర్ ను తగ్గించి జుట్టును బలంగా చేస్తాయి.
పైన్ గింజల్లో జుట్టుకు అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు మన జుట్టుకు మంచి పోషణను అందిస్తయాి. అలాగే జుట్టును బలంగా, పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.