Lifestyle
భార్యలు భర్తలకు మద్ధతుగా నిలవడం సర్వసాధారణమైన విషయం. అయితే భర్తలు చేసే కొన్ని తప్పులను భార్యలు ఊపేక్షించకూడదని చాణక్య నీతిలో పేర్కొన్నాడు.
భర్తలు చెప్పే అబద్ధాలను భార్యలు ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. దీర్ఘకాలంలో ఇది కేవలం వారి బంధాన్ని మాత్రమే కాదు, కుటుంబాన్ని నాశనం చేస్తుందని గమనించాలి.
భర్త చేసే దుబార ఖర్చుల విషయంలో కూడా భార్యలు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తుంటే అస్సలు విస్మరించకూడదని గుర్తుంచుకోవాలి.
మా ఆయనకు కోపం ఎక్కువ అని కొందరు భార్యలు గొప్పగా చెబుతుంటారు. అయితే ఇది మంచిది కాదు. మితిమీరిన కోపం భార్యభర్తల మధ్య బంధాన్ని ఏదో ఒక సమయంలో దూరం చేస్తుందని గుర్తించాలి.
భర్త పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని చాలా మంది భార్యలు ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకుంటారు. ఇలా చేయడం వల్ల కూడా బంధానికి బీటలు వారే అవకాశాలు ఉంటాయి.
నేను ఏం చేస్తే నీకెంటి? నీకు కావాల్సింది ఇస్తున్నా కదా అని అనే భర్త మాటలను అస్సలు ఉపేక్షించకూడదు. అప్పులు చేస్తున్నారా అన్న విషయాలను కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి.