Lifestyle
మంచి ఆరోగ్యం, ఆహార రుచిని పెంచడానికి చాలా భారతీయ కుటుంబాలు ఆవు లేదా బర్రె నెయ్యిని ఉపయోగిస్తాయి. అయితే, బర్రె నెయ్యి కంటే ఆవు నెయ్యి మంచిదని నమ్ముతారు? ఎందుకు?
ఆవు నెయ్యిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ ఏ, డీ, ఈ, కే లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల జీర్ణం చేసుకోవడం సులభంగా ఉంటుంది.
ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరంలోని వాపు తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే బర్రె నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
బర్రె నెయ్యితో ప్రయోజనాలు వుండని కాదు. కానీ, గేదె నెయ్యిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. కాబట్టి అధిక కేలరీలు కొవ్వు బరువు పెరగడానికి కారణమవుతాయి.
విటమిన్ కే2 తో నిండిన ఆవు నెయ్యి ధమనుల కాల్సిఫికేషన్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ప్రతిరోజూ 1 స్పూన్ ఆవు నెయ్యిని తినడంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆవు నెయ్యి బర్రె నెయ్యి కంటే తేలికైనది. అన్ని వయసుల వారు దీనిని సులభంగా జీర్ణం చేసుకోగలరు. జీర్ణ ఆరోగ్యానికి ఆవు నెయ్యి తినడం మంచిది.
ఆవు లేదా బర్రె నెయ్యిని పోల్చినట్లయితే, ఆయుర్వేదం ప్రకారం ఆవు నెయ్యి మంచిది. మీరు ఎప్పుడైనా పిల్లల కోసం నెయ్యిని ఎంచుకోవాలనుకుంటే, ఆవు నెయ్యిని మాత్రమే కొనండి.