జామ ఆకుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ ఆకులను మరిగించి తాగితే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
Image credits: Getty
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
జామ ఆకుల్లో క్వెర్సిటిన్, లైకోపీన్ వంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాదుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Image credits: Getty
బిపిని నియంత్రిస్తుంది
జామ ఆకులు బీపీ పేషెంట్లకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం హైబీపీని నియంత్రించడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
మంచి నిద్ర
జామ ఆకు టీ తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల టీ తాగితే బాగా నిద్రపడుతుంది.
Image credits: Getty
జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది
జామ ఆకుల్తో తయారుచేసిన టీ తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అతిసారం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
Image credits: Getty
పంటి నొప్పి తగ్గిస్తుంది
జామ ఆకులు నోటిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ ఆకుల టీ చిగుళ్ల వాపు, పంటి నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.