బియ్యం, పప్పులు, పిండి డబ్బాలో బిర్యానీ ఆకులను వేయడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో తెలుసా?
కీటకాల నుంచి రక్షణ
బిర్యానీ ఆకులను బియ్యం, పిండి, పప్పుల డబ్బాలో ఉంచితే పురుగులు, కీటకాలు పట్టే అవకాశమే రాదు. ఎందుకంటే ఈ ఆకు వాసన వాటికి అస్సలు నచ్చదు.
ధాన్యాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది
బిర్యానీ ఆకుల ఔషద లక్షణాలు, వాసన బియ్యాన్ని, పిండిని, పప్పులను ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
బూజు, క్రిములను నివారిస్తుంది
బిర్యానీ ఆకుల్లో బూజు నిరోధక లక్షణాలు కూడా మెండుగా ఉంటాయి. అంటే ఇది పిండిని, బియ్యాన్ని, పప్పులను బూజు, క్రిముల నుంచి కాపాడుతుంది.
జీవితకాలం పెంచుతుంది
బిర్యానీ ఆకుల వల్ల బియ్యం, పప్పులు, పిండి జీవితకాలం పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఆకులు సహజ కీటక నిరోధకంగా పనిచేస్తుంది. అందుకే ధాన్యాలేవైనా వాటిలో బిర్యానీ ఆకులను వేసి మూతపెట్టండి.
ఖర్చు తక్కువ పద్ధతి
నిజానికి ఇది పైసా ఖర్చు లేని పద్దతి. మార్కెట్ లో దొరికే ఖరీదైన కీటకనాశకాలు లేదా రసాయన ఉత్పత్తులను ఉపయోగించకుండానే ఆహార పదార్థాలను కీటకాలు, పురుగుల నుంచి రక్షిస్తుంది.