Lifestyle

చాణక్య నీతి: మీకు నిజమైన స్నేహితులు, బంధువులు ఎవరో తెలుసా?

చాణక్య నీతి

భారతదేశ గొప్ప పండితులలో ఆచార్య చాణక్య ఒకరు. ఆయన తన నీతిలో మనకు నిజమైన స్నేహితులు, బంధువుల విషయంలో ఆరు విషయాలను గురించి ప్రస్తావించారు.

చాణక్య నీతి శ్లోకం...

ఆతూరే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షేత్రే శత్రుసంకటే | రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః |

అనారోగ్య సమయంలో

ఆచార్య చాణక్య ప్రకారం అనారోగ్య సమయంలో మీతో ఉండి సహాయం చేసే వ్యక్తే మీ నిజమైన మిత్రుడు.

దుఃఖంలో తోడుండేవాడు

ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది. చాణక్య ప్రకారం దుఃఖ సమయంలో తోడుండేవారే నిజమైన బంధువులు.

కరువు సమయంలో

కరువు వచ్చినప్పుడు, ఆహారం దొరకనప్పుడు తోడుండేవాడే నిజమైన మిత్రుడు.

శత్రువు ఎదురైనప్పుడు

ఎవరితోనైనా గొడవ జరిగినప్పుడు, ధైర్యంగా మీ వెన్నంటే ఉండేవాడే నిజమైన మిత్రుడు.

రాజకార్యాల్లో

కోర్టు కేసులో చిక్కుకున్నప్పుడు తోడుండేవారే నిజమైన మిత్రులు, బంధువులు.

శ్మశానంలో తోడుండేవాడు

కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుండేవారే నిజమైన మిత్రులు, స్నేహితులు. 

రోజూ ఒక జామ కాయ తినండి చాలు..

కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.? సింపుల్‌ చిట్కాలు..

ఈ విషయాల్లో సిగ్గు పడుతున్నారా? మీరు జీవితంలో ఎదగరు

పాత స్వెటర్లను పారేయకుండా.. ఇలా వాడండి