Lifestyle

కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.? సింపుల్‌ చిట్కాలు..

Image credits: Freepik

జీలకర్ర నీరు

కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర మెరుగ్గా పనిచేస్తుంది. రాత్రంతా నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 


 

Image credits: Getty

అల్లం

అల్లంలో ఉన్న ఎన్నో మంచి గుణాలు కడుపు నొప్పిని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. కడుపు నొప్పిగా ఉన్న సమయంలో చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది. 

Image credits: Getty

దానిమ్మ

విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న సమయంలో ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపు నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: Getty

నీరు తాగుతున్నారా?

కడుపు నొప్పిగా ఉంటే తెలుసుకోవాల్సిన మరో విషయం సరిపడ నీటిని తాగుతున్నారా లేదా.? కొన్ని సందర్భాల్లో నీరు తాగకపోయినా జీర్ణ సమస్యలు తలెత్తి కడుపు నొప్పికి దారి తీస్తుంది. 

Image credits: our own

వాము కూడా..

కడుపు నొప్పిని తగ్గించడంలో వాము బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. భోజనం చేసిన వెంటనే వాములో కొంత ఉప్పు కలుపుకుని తీసుకుంటే ఆహారం జీర్ణమవుతుంది.

Image credits: Google

నడవడం

కడుపు విపరీతంగా నొప్పి ఉంటే అలాగే కదలకుండా కూర్చోకూడదు. అటు, ఇటు నడవాలి ఇలా చేయడం వల్ల కడుపులో కండరాలు వదులుగా మారి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image credits: Getty

వైద్యులను సంప్రదించాలి

ఇవి కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. కడుపు నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా, దీర్ఘకాలంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 


 

Image credits: our own

ఈ విషయాల్లో సిగ్గు పడుతున్నారా? మీరు జీవితంలో ఎదగరు

పాత స్వెటర్లను పారేయకుండా.. ఇలా వాడండి

నల్లగా ఉన్నాయని లైట్‌ తీసుకోకండి.

మందు తాగేటప్పుడు ఇవి మాత్రం తినకండి