Lifestyle

ఈ విషయాల్లో సిగ్గు పడుతున్నారా? మీరు జీవితంలో ఎదగరు

Image credits: adobe stock

అప్పు తిరిగి అడిగేప్పుడు

మనలో కొందరు ఇచ్చిన అప్పును తిరిగి అడిగేందుకు మొహమాటపడుతుంటారు. అయితే ఇచ్చిన అప్పు తిరిగి రావాలంటే కచ్చితంగా సిగ్గు, మొహమాటం లాంటి వాటిని వదిలి పెట్టాలని చాణక్య నీతిలో పేర్కొన్నాడు.

Image credits: Our own

ఆహారం విషయంలో

తినే ఆహారం విషయంలో కూడా సిగ్గుపడకూడదు. మంచి ఆహారం తీసుకుంటేనే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఆలోచన శక్తి మెరుగ్గా ఉంటుందని కాబట్టి తిండి విషయంలో అస్సలు సిగ్గు పడొద్దు. 
 

Image credits: FREEPIK

నేర్చుకునే విషయంలో

చాలా మంది కొత్తది ఏదైనా నేర్చుకునే సమయంలో సిగ్గు పడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు. సిగ్గు అనేది నేర్చుకునే క్రమాన్ని అడ్డుకుంటుంది. 
 

Image credits: freepik

అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో

కొందరు తమలోని అభిప్రాయాలను లోపలే దాచుకుంటారు. అయితే మీ అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తం చేయాలి. తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పేయాలి. నచ్చని చోట మొహమాటంగా కూడా ఉండకూడదు. 
 

Image credits: Getty

పని విషయంలో

చేసే పని విషయంలో సిగ్గు పడే వారు జీవితంలో పైకి రారు అనేది చాణక్య నీతిలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంటి పనుల్లో సిగ్గు పడితే ఆర్థికంగా నష్టపోతారు. 

Image credits: FREEPIK

ఎదుటి వారితో మాట్లాడేప్పుడు

మనిషి సంఘ జీవి. నలుగురితో మాట్లాడితేనే ప్రయోజనాలు ఉంటాయి. అలా కాకుండా కొందరు నలుగురితో మాట్లాడే సమయంలో సిగ్గు పడుతుంటారు. దీని ద్వారా కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చి ఇబ్బందులు వస్తాయి. 
 

Image credits: Getty

పాత స్వెటర్లను పారేయకుండా.. ఇలా వాడండి

నల్లగా ఉన్నాయని లైట్‌ తీసుకోకండి.

మందు తాగేటప్పుడు ఇవి మాత్రం తినకండి

అరటి తొక్కలను ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా.?