బెడ్ రూం ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే బెడ్ రూంలో చెత్త, చెదారం, మురికి బట్టలు ఉంటే మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
హిందూ మతం ప్రకారం.. ప్రతి ఒక్కరూ తూర్పు లేదా దక్షిణం దిక్కుగా తల పెట్టి పడుకోవాలి. ఉత్తరం దిక్కు తల పెట్టి పడుకుంటే మన మెదడు, గుండెపై ఒత్తిడి పడుతుంది.
ప్రతి ఒక్కరూ కాళ్లు, చేతులు చాపి పడుకోవాలి. అలాగే ఎత్తైన తలదిండును అసలే వాడకూడదు. దీనివల్ల మెడ నొప్పి వస్తుంది.
ఎడమ వైపు తిరిగి కాళ్లు మడిచి, చేతులు వదులుగా ఉంచి పడుకుంటే రక్త ప్రసరణ, జీర్ణక్రియ బాగుంటాయి. వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉండదు.
గర్భిణులు వెల్లకిలా, కుడి సైడు తిరిగి అసలే పడుకోకూడదు. వీళ్లు ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది.
ఈశాన్య, ఉత్త దిక్కు తలపెట్టి పడుకుంటే మీ మానసిక స్థితి దెబ్బతింటుంది. అలాగే మీరు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు.