Lifestyle
హిందూ ధర్మంలో అరటి చెట్టును పవిత్రంగా చూస్తారు. దీనిని పూజతో అనేక దోషాలు తొలగుతాయనే నమ్మకం. అరటి చెట్టు పూజను ఎందుకు చేయాలో ఉజ్జయిని జ్యోతిష్యులు పండిట్ ప్రవీణ్ ద్వివేది చెప్పారు.
జ్యోతిష్యులు పండిట్ ద్వివేది ప్రకారం.. అరటి చెట్టు గురు గ్రహానికి కారకం. ఎవరి జాతకంలో గురువు అశుభ స్థితిలో ఉంటాడో, వారు అరటి చెట్టును పూజించాలని చెప్పారు.
అరటి చెట్టును పూజించడంతో శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడవుతాడు. విష్ణువు, లక్ష్మీదేవికి అరటి పండును నిత్యం నైవేద్యంగా సమర్పించడంతో భక్తుల వారి దీవేనలు అందుకుంటారు.
ఎవరికైనా వివాహంలో ఆలస్యం అవుతుంటే, వారు అరటి చెట్టును పూజించాలని చెప్పారు. అరటి చెట్టును పూజించడం వల్ల త్వరగా పెళ్లి యోగం కలుగుతుందని వివరించారు.
భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరుగుతుంటే, ఇద్దరూ కలిసి అరటి చెట్టు కింద శుద్ధమైన నెయ్యి దీపం వెలిగించి, నీళ్ళు పోయాలి. దీంతో వారి ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుంది.
మంచి సంతానం కోసం ప్రతి గురువారం అరటి చెట్టు కింద కూర్చుని భార్యాభర్తలిద్దరూ లేదా వారిలో ఒకరు గురు గ్రహ మంత్రాలను జపించాలి. దీంతో మంచి సంతానం కలుగుతుందని నమ్మకం.