Spiritual
ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం గురించి అనేక కథనాలు ఉన్నాయి. చాలా శివాలయాలు ఈ విషయంలో పోటీపడుతున్నాయి. అవేంటో చూద్దాం.
శివలింగం పుట్టుక గురించి వివిధ గ్రంథాల్లో వివిధ రకాలుగా ప్రస్తావించారు. పురాతన శివలింగాలుగా పిలవబడే కొన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.
చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఉన్న గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రపంచంలోనే పురాతనమైనదిగా పిలుస్తారు. ఈ ఆలయం ఒక నేచురల్ గుహలో ఉంది.
గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి అనేక మత గ్రంథాల్లో ప్రస్తావించారు. ఇది స్వయంభు శివలింగం అని, స్వయంగా శివుడే ఈ విషయాన్ని వెల్లడించాడని చెబుతారు.
తమిళనాడులోని అరుణాచలేశ్వరాలయంలోని శివలింగం కూడా పురాతన శివలింగంమని భక్తులు విశ్వసిస్తారు.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఉన్న జాగేశ్వర్ ధామ్ కూడా ఒక ముఖ్యమైన శివాలయం. ఇక్కడ శివలింగం ప్రపంచంలోనే పురాతన శివలింగమని భక్తుల నమ్మకం.
జాగేశ్వర్ ధామ్‌లో దాదాపు 250 చిన్న, పెద్ద ఆలయాలు ఉన్నాయి. వీటిలో 224 ఒకే చోట ఉన్నాయి. సప్తఋషులు కలిసి వీటిని ప్రతిష్టించారని చెబుతారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని రహత్‌గఢ్‌లో ఉన్న ఈ శివాలయం దాదాపు 900 సంవత్సరాల నాటిది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఒక్కచోటే 108 శివలింగాలు ఉంటాయి.
రహత్‌గఢ్ శివాలయంలో ఒక శివలింగంపై నీళ్లు పోస్తే 108 శివలింగాలకు ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది. ముఖ్యంగా మహా శివరాత్రి సమయంలో ఇక్కడకు భారీగా భక్తులు వస్తారు.