Lifestyle
చెడు అలవాట్లు ఉన్న వారిని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వండి. వారు తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా పక్కనున్న వారి జీవితాలను సైతం పాడు చేస్తారని గుర్తు పెట్టుకోండి.
అవకాశవాదులు ఛాన్స్ దొరికితే మోసం చేయడానికే ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారికి కూడా దూరంగా ఉంటేనే మంచిదని చాణక్య నీతిలో పేర్కొన్నాడు.
నిత్యం నెగిటివ్‌గా ఆలోచించే వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారితో సావాసం చేయడం అస్సలు మంచిది కాదు. ఇలాంటి వారితో ఉంటే ఏ పని చేయలేరు.
మీ ముందు నిత్యం ఇతరుల గురించి తప్పుగా చెప్పే వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు మీ గురించి కూడా ఇతరులకు తప్పుగా చెప్తారని గుర్తుపెట్టుకోండి.
కొందరు వ్యక్తులు అడగకపోయినా నిత్యం అవసరల సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి వారికి కూడా దూరంగా ఉండాలని చాణక్య నీతిలో పేర్కొన్నాడు.
ఏ బంధంలో అయినా నిజాయితీ ముఖ్యం. నిత్యం అబద్ధాలు చెప్పే వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారితో సావాసం ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తించాలి.
ఇలాంటి వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ పక్కనే ఉంటూ నవ్వుతూ ఉంటారు. కానీ మీ ఎదుగుదలను అస్సలు స్వీకరించలేరు. అసూయతో రగిలిపోతుంటారు.