ఆటోమేటిక్ టెంపరేచర్ కట్ ఆఫ్ ఉన్న ఇస్త్రీ వాడటం మంచిది. ఇది నిర్దిష్ట ఉష్ణోగ్రతకి చేరిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది.ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది
పదేపదే ఐరన్ చేయకుండా వారానికి ఒక్కసారి బట్టలు ఇస్త్రీ చేయండి. ఇలా చేయడం వల్ల విద్యుత్తు వినియోగం తగ్గి, కరెంట్ ఆదా అవుతుంది.
తక్కువ వేడి అవసరం ఉన్న బట్టలను ముందుగా, ఎక్కువ వేడి కావలసినవి తర్వాత ఇస్త్రీ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.
తడి బట్టలు ఇస్త్రీ చేయకూడదు. ఇస్త్రీ ఎక్కువగా వేడెక్కాలి కాబట్టి విద్యుత్తు వృధా అవుతుంది.
ఇస్త్రీ బోర్డు మీద మందమైన బట్ట వేయాలి. అలా వేడి సమంగా పంపిణీ అవుతుంది. ఇలా చేయకపోతే బట్టల ముడతలు సరిగా పోవు. అలాగే, బట్టలు కాలిపోయే ప్రమాదం తక్కువ.
బట్టలు ఐరన్ చేసే సమయంలో ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఫ్యాన్ గాలి ఇస్త్రీ వేడిని తగ్గించి, బట్టలు సరిగా ఇస్త్రీ కాకుండా ఆటంకంగా మారుతుంది.
తక్కువ వోల్టేజ్‌లో ఇస్త్రీ చేయడం వల్ల వేడి సరిగా రాదు. బట్టలు సరిగ్గా ఇస్త్రీ కావు. కాబట్టి, సరైన వోల్టేజ్ లో ఐరన్ చేయండి.