Lifestyle

ఈ తప్పులు చేస్తున్నారా? మెదడు దెబ్బతినడం ఖాయం

Image credits: Social Media

అలవాట్లు

మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని అలవాట్లు మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Image credits: Getty

గంటల తరబడి కూర్చోవడం

గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం మెదడును దెబ్బతీస్తుంది. పనిలో పడి అలాగే కూర్చోకూడదు. కనీసం ప్రతీ గంటకు ఒకసారి లేచి అటు, ఇటు నడవడం అలవాటు చేసుకోవాలి. 

Image credits: pexels

బాగా నిద్రపోండి

మెదడు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే మరో సమస్య నిద్రలేమి. తగినంత నిద్ర లేకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాల్సిందే. 

Image credits: social media

ఫోన్ ఎక్కువగా వాడకండి

గంటల తరబడి ఫోన్ లతో కుస్తీ పడితే కూడా మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Image credits: Getty

పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్

బిజీ లైఫ్ లో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను మిస్ చేస్తున్నారు.ఇది కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది. కచ్చితంగా ఉదయం మంచి పోషకాలతో కూడిన టిఫిన్ తీసుకోవాలని చెబుతున్నారు. 

Image credits: Getty

బాగా నీళ్లు తాగండి

శరీరంలో నీటి శాతం తగ్గితే మెదడు పనితీరు దెబ్బతింటుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు రోజూ తాగాలి. 

Image credits: our own

పెద్ద శబ్ధంతో పాటలు వినడం

చెవులకు హెడ్ సెట్ పెట్టుకొని ఎక్కువ సౌండ్ తో పాటలు వినడం కూడా మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే వీలైనంత వరకు హెడ్ సెట్స్ కు దూరంగా ఉండడమే ఉత్తమం. 

Image credits: freepik

జంక్ ఫుడ్

ఇటీవల జంక్ ఫుడ్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే చక్కెర, ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Image credits: Getty

బెండకాయ ఎవరు తినకూడదు..?

టీ కొట్టు నుంచి వేల కోట్ల వ్యాపారానికి.. పుల్లారెడ్డి సక్సెస్‌ స్టోరీ

రోజుకో గుడ్డు తినమని ఎందుకు చెప్తారో తెలుసా?

చలికాలంలో ఇడ్లీ,దోశ పిండి పొంగాలంటే ఏం చేయాలి?