ప్లాస్టిక్ వస్తువులు వాడటం సులభం కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. వెదురుతో చేసిన కట్టింగ్ బోర్డ్ వాడటం మంచిది.
మాంసం, చేపలు, కూరగాయలకు ఒకే బోర్డ్ వాడకండి. దీని వల్ల క్రిములు పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రతిసారి వాడిన తర్వాత బోర్డ్‌ను శుభ్రంగా కడగాలి. రెండు వైపులా బాగా కడగాలి.
సబ్బు, వెచ్చని నీటితో బాగా రుద్ది కడిగితే మలినాలు, క్రిములు పోతాయి.
చెక్క కటింగ్ బోర్డ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహార పదార్థాల వాసనలు అంటుకునే అవకాశం ఉంది. ఉప్పు చల్లి, నిమ్మకాయతో రుద్ది కడిగితే వాసన పోతుంది.
చెక్క కటింగ్ బోర్డ్ శుభ్రం చేయడానికి వెనిగర్ కూడా వాడవచ్చు. ఇది శుభ్రం చేయడమే కాకుండా క్రిములను కూడా చంపుతుంది.
బేకింగ్ సోడా, వెనిగర్‌తో కటింగ్ బోర్డ్ శుభ్రం చేయవచ్చు. బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి బోర్డ్‌కు పట్టించాలి.