Lifestyle

ఇలా చేస్తే దుప్పట్లను ఉతకకున్నా.. శుభ్రంగా ఉంటాయి

వారానికి ఒకసారి ఎండలో ఆరబెట్టాలి

దుప్పట్లను వాష్ చేయకున్నా.. శుభ్రంగా ఉండాలంటే వాటిని వారానికి ఒకసారి ఎండలో వేయాలి. దీనివల్ల దుప్పట్లలోని బ్యాక్టీరియా, దుమ్ము కణాలు నశిస్తాయి.వాటి నుంచి దుర్వాసన కూడా రాదు.

బేకింగ్ సోడా

దుప్పట్లపై బేకింగ్ సోడాను చల్లి మీరు దుప్పట్ల నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టొచ్చు. ఇందుకోసం దుప్పట్లపై బేకింగ్ సోడాను చల్లి కొన్ని గంటల తర్వాత వాక్యూమ్ క్లీనర్ లేదా చేతితో దులపండి

ఫాబ్రిక్ ఫ్రెషనర్ స్ప్రే

దుప్పట్లకు వస్తున్న దుర్వాసన పోవాలంటే వాటిపై ఫాబ్రిక్ ఫ్రెషనర్ స్ప్రే  చేయండి. 

వారానికి ఒకసారి

ఒకేదగ్గర ఉంచితే దుప్పట్లకు దుమ్ము, మురికి అంటుకుంటాయి. అందుకే ప్రతీ వారం దుప్పట్లను తిరగేసి వేర్వేరు వైపుల నుంచి ఉపయోగించండి. దీనివల్ల అవి శుభ్రంగా ఉంటాయి.

వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయండి

వాక్యూమ్ క్లీనర్‌తో దుప్పట్లను క్లీన్ చేయడం చాలా ఈజీ. తక్కువ సెట్టింగ్‌లో వాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించి దుప్పట్లను శుభ్రం చేయండి. దీంతో దుప్పట్లకు ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోతాయి.

కవర్ ఉపయోగించండి

దుప్పట్లకు కవర్లను చుట్టడం వల్ల వాటికి నేరుగా దుమ్ము, మురికి అంటుకోవు. ఇందుకోసం దుప్పట్లపై  కాటన్ లేదా మైక్రోఫైబర్ కవర్ ను వేయండి. దీనిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉతకొచ్చు. 

డ్రై క్లీనింగ్ పౌడర్ వాడండి

 డ్రై క్లీనింగ్ పౌడర్‌తో కూడా మీరు దుప్పట్లకు అంటిన మరకలను, దుమ్మును పోగొట్టొచ్చు. ఇందుకోసం దుప్పట్లపై డ్రై క్లీనింగ్ పౌడర్ చల్లి కొంత సేపటి తర్వాత దులపండి. 

మహిళల్లో కొలిస్ట్రాల్ తగ్గించే ఆహారాలు

దానిమ్మ పండు రోజూ తింటే జరిగేది ఇదే

విరాట్ కోహ్లి ఏం తింటాడు? ఏం తినకుండా ఉంటాడో తెలుసా?

మహిళల్లో నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?