Lifestyle

విరాట్ కోహ్లి ఏం తింటాడు? ఏం తినకుండా ఉంటాడో తెలుసా?

Image credits: Instagram

సరైన డైట్, వ్యాయామం

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. రోజూ అతని డైట్, వ్యాయామమే అతన్ని అంత హెల్తీగా, ఫిట్ గా ఉంచుతుందని అతను చెప్తాడు. 

Image credits: google

కోహ్లీ డైట్ సీక్రెట్

అసలు విరాట్ కోహ్లీ ఏం తింటాడు అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఇతని ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులందరికీ ఉంటుంది. ఇతను 90% ఆవిరి మీద ఉడికించిన ఆహారాన్నే తింటాడట.

Image credits: our own

విరాట్ ఏం తినడు

విరాట్ కోహ్లీ ఆరోగ్యాన్ని పాడు చేసే మసాలాలు, సాస్‌ లను అసలే తినడు. ఇతను కేవలం మిరియాలు, ఉప్పును మాత్రమే వాడుతాడు. 

Image credits: google

సలాడ్లు, రాజ్మా

విరాట్ కోహ్లీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాడు. ఇతని డైట్లో ఖచ్చితంగా సలాడ్లు ఉంటాయి. అలాగే ప్రోటీన్ కోసం రాజ్మాను కూడా తింటాడు. ఈ క్రికెటర్ వేపుళ్లకు, నూనెలకు చాలా దూరం.

Image credits: google

సలాడ్లు

విరాట్ కోహ్లీ సలాడ్లను చాలా ఇష్టంగా తింటాడు. ముఖ్యంగా బచ్చలికూర, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలిపిన సలాడ్ ను రెగ్యులర్ గా తింటాడు. 

Image credits: Getty

గ్రిల్డ్ వెజిటేబుల్స్, సూప్

విరాట్ కోహ్లీ గ్రిల్డ్ వెజిటేబుల్స్, సూప్ ను లంచ్, డిన్నర్ లో ఖచ్చితంగా తింటాడు. ఇతనికి డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ,  బొప్పాయి అంటే ఎంతో ఇష్టం.

Image credits: google

పాల ఉత్పత్తులను తీసుకోడు

ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్ ను విరాట్ కోహ్లీ అసలే తినడు. ఇతను మసాలా ఫుడ్,  వేపుళ్లు, పాల ఉత్పత్తులను అస్సలు తీసుకోడు. వీటికి బదులుగా టోఫు, సోయాను తీసుకుంటాడు. 

Image credits: our own

స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో

విరాట్ కోహ్లీ ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ మర్చిపోకుండా వ్యాయామం చేస్తాడు. ఇతను స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో వంటి వ్యాయామాలను ఎంత బిజీగా ఉన్నా చేస్తాడు.

Image credits: Getty

మహిళల్లో నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

వెండి మంగళసూత్రాలు..అదిరిపోయే డిజైన్లు

జస్ట్ రూ. 500 లకే బంగారం లాంటి ఉంగరాలు

భార్య మందు భర్త అస్సలు అనకూడని విషయాలు ఇవే