ఇంట్లో ఏదైనా అద్దం పగిలితే దాంతో అందమైన నీటి కెరటాన్ని సృష్టించవచ్చు. అద్దం ముక్కలను చిత్రంలో చూపించి విధంగా అతికిస్తే నీటి కెరటం తయారవుతుంది.
పగిలిన అద్దం ముక్కలతో ఇలాంటి సీతాకోకచిలుక డిజైన్‌ను కూడా తయారు చేయవచ్చు. పెద్ద, చిన్న ముక్కలను ఒక్కొక్కటిగా అమర్చి, వాటిపై వెండి మెరుపులు చల్లుకోవాలి.
ఈ జింక డిజైన్‌ను కార్డ్‌బోర్డ్‌పై కత్తిరించి, పగిలిన అద్దం ముక్కలను ఒక్కొక్కటిగా అతికించి, ఫ్రేమ్ చేసి గోడకు వేలాడదీయండి.
మీ ఇంటి అద్దానికి అందమైన లుక్ ఇవ్వాలనుకుంటే, దాని చుట్టూ వెడల్పుగా బోర్డర్ తయారు చేసి, పగిలిన అద్దం ముక్కలను గ్లూ గన్ సహాయంతో అతికించండి.
అద్దం ముక్కలను వివిధ రంగులతో పెయింట్ చేసి ఇలాంటి సీతాకోకచిలుక దృశ్యాన్ని సృష్టించవచ్చు. ఫ్రేమ్ చేసి ఇంట్లో అందరికీ కనిపించేలా పెట్టండి.
పగిలిన అద్దం ముక్కలతో ఆధునిక కళను కూడా సృష్టించవచ్చు. వాటిని వివిధ ఆకారాల్లో విభజించి, కార్డ్‌బోర్డ్‌పై అతికించి ఫ్రేమ్ చేయించండి.
పగిలిన అద్దం ముక్కలను ఇలా అమర్చి క్రిస్మస్ చెట్టును తయారు చేయవచ్చు. మధ్యలో వెండి మెరుపులు అతికించి పైన నక్షత్రం అతికిస్తే క్రిస్మస్ చెట్టు రెడీ.
మహా కుంభమేళా: పుణ్య స్నానానికి వెళ్ళినప్పుడు ఇవి మర్చిపోకండి
ఎక్కువ రోజులు బతకాలని ఉందా? ICMR చెప్పిన ఈ చిట్కాలు పాటించాల్సిందే
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే టాప్ 10 భాషలు: తెలుగు నంబర్ ఎంతో తెలుసా?
జుట్టు రాలడానికి.. మీరు తింటున్న ఈ ఆహారమే కారణం.