Health
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ ఎంత ముఖ్యమో నీరు అంతే ముఖ్యం. రోజులో కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు.
సీజనల్ ఫ్రూట్స్‌ను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ వంటి వాటిని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. వీటివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఉప్పు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉప్పును అదుపు చేస్తే ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటారు.
లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వంటివి తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అప్పడప్పుడు వీటిని నేరుగా తీసుకున్నా మంచిదే.
ఆరోగ్యంగా ఉండాలంటే తిన్న వెంటనే పడుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.
వీలైనంత వరకు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నూనెలు తక్కువగా ఉండే ఫుడ్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి.
శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కచ్చితంగా యోగా, మెడిటేషన్ వంటి అలవాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.