Food
ఉల్లిపాయ రోజూ తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. ఉల్లిపాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉల్లిపాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
సల్ఫర్ అధికంగా ఉండే ఉల్లిపాయ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఉల్లిపాయ చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను నివారించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
ఉల్లిపాయలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.